Andhra PradeshHome Page SliderNews Alert

జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం..

విజయవాడలోని సితార సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ పేరుతో ఏర్పాటు చేసిన మేళాలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. ఎగ్జిబిషన్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.