ప్రముఖ నటుడు ఇంట తీవ్ర విషాదం
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సుదీప్ ను పరామర్శించి.. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేశారు. మరోవైపు అభిమానులు సైతం సంతాపం తెలుపుతున్నారు.

