డ్రగ్స్ జోలికి పోని సమాజమే లక్ష్యం: చిరంజీవి
టిజి: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఆయన కోరారు. డ్రగ్స్‌తో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బాధితులను శిక్షించడం కన్నా రక్షించడమే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తోంది. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా బ్యూరోకు సమాచారం ఇవ్వాలి అని ఆయన ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

