తొందరపడి పెళ్లి చేసుకోవద్దంటున్న క్రికెటర్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ 2021లో తన భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై ఆయన తొలిసారి స్పందించారు. తనకి వివాహబంధంపై సరైన అవగాహన లేకపోవటంతోనే విఫలమయ్యానన్నారు. ఈ విషయంలో తాను ఎవరిని తప్పుబట్టబోనని తెలిపారు. కాగా ఆయన విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. మరోసారి ప్రేమలో పడాలన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా..ఎదురయ్యే అవాంతరాలపై జాగ్రత్తగా ఉంటానని ఆయన పెర్కొన్నారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎటువంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోవద్దని ఆయన నేటి యువతకు హితవు పలికారు.

