ఎలాంటి ట్యాక్స్ లేని దేశం..పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీ
పసిఫిక్ మహా సముద్రంలో అందమైన ద్వీపదేశం వనౌటు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఇటీవల అక్కడ పౌరసత్వం తీసుకోవడంతో ఆ దేశం గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఎక్కువయ్యింది. గతంలో లలిత్ మోదీపై ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లోని దర్యాప్తును తప్పించుకోవడానికే అక్కడ పౌరసత్వం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ ఎలాంటి ట్యాక్సులు లేకపోవడం విశేషం. ఆదాయం ఎలా సంపాదించినా, విదేశాల నుండి వచ్చినా, దీర్ఘకాలిక లాభాలపై, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి ఎలాంటి వ్యాపారాలు చేసే వారికీ పన్నులు లేవు. వారసత్వ పన్ను గానీ, కార్పొరేట్ పన్ను గానీ లేదు. గిఫ్ట్ ట్యాక్స్ కూడా లేదు. గతేడాది హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో కూడా వనౌట్ దేశం మొదటి స్థానంలో నిలిచింది. అంతే కాదు, ఆ దేశం క్రిప్టో కరెన్సీ హబ్‌గా కూడా అభివృద్ధి చెందుతోంది. అందుకే సంపన్నులు తీసుకునే గోల్డెన్ పాస్‌పోర్టు ద్వారా లలిత్ మోదీ ఆ దేశ పౌరసత్వం పొందారు.

