విదేశాల్లో బతుకమ్మను పోలిన రంగుల పూల పండుగ
పూల పండుగ అనగానే మనకు బతుకమ్మ పండుగే గుర్తుకొస్తుంది. కానీ ఫిలిఫైన్స్‌లో జరిగే ‘పనగబెనా’ అనే రంగురంగుల పూల ఉత్సవం ప్రతీ ఏటా నెలరోజుల పాటు జరుగుతుంది. ‘పనగబెనా’ అంటే పూలు వికసించడం. ఈ పేరుతోనే పూలు వికసించే ఈ కాలంలో ఈ ఉత్సవం జరుపుతారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 5 వరకు ‘సెషన్ రోడ్ ఇన్ బ్లూమ్’ అనే పేరుతో పెద్ద ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులో రకరకాల పూలతో చేసిన అందమైన ఆకృతులు చూడవచ్చు. అక్కడి ప్రజల ఆటపాటలతో సందడిగా సంప్రదాయ నృత్యాలు చేస్తారు. వారు ధరించే దుస్తులు రకరకాల థీమ్స్‌తో ఉంటాయి.

ఈ వేడుకలు చూసేందుకు ఫిలిపైన్స్ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు. 1990లో సంభవించిన భూకంపం నుండి తిరిగి కోలుకున్న తర్వాత కాలం నుండి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా ఈ ఉత్సవం రద్దు అయ్యింది. అందుకే ఈ సంవత్సరం పెద్దఎత్తున వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

