International

ఎంత మర్యాదగా అడిగితే అంత ధర తక్కువ

కస్టమర్లలో మర్యాదను పెంచేందుకు ఓ కాఫీ కేఫ్ నిర్వాహకులు వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇంగ్లాండ్‌లోని ప్రెస్టన్‌లో దేశీ ఛాయ్‌కు ఫేమస్ అయిన ఛాయ్ స్టాప్ కేఫ్‌లో..ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎంత మర్యాదగా పిలిచి అడిగితో ధర అంత తగ్గుతుందని ఓ మెనూని ఏర్పాటు చేశారు. దాని పై ఈ విధంగా రాసి ఉంచారు. ‘ దేశీ ఛాయ్ ’ అని పిలిస్తే దాని ధర రూ.464 , ‘ దేశీ ఛాయ్ ప్లీజ్ ’ అంటే రూ.278 , ‘ హెలో, దేశీ ఛాయ్ ప్లీజ్ ’ అంటే దాని ధర రూ.176కే టీ పొందేలా ఆ మెనూ బోర్డు పై రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.దీనికి కొందరు నైస్ ఐడియా అంటూ కామెంట్లు పెడుతున్నారు.