అంబటి రాంబాబుపై కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మెట్లపై అనుచరులతో కూర్చుని చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతొ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

