Home Page Sliderhome page sliderTelangana

ఢీకొట్టిన కారు.. గాలిలో ఎగిరిపడిన ఇద్దరు వ్యక్తులు!

తెలంగాణలోని మెదక్ జిల్లా వెంకట్ రావు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకుని రాంగ్ రూట్ లో వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో బైకుపై రైడ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగిరిపడ్డారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో బైకును ఢికొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.