మంటల్లో కాలిబూడిదైన బెంజ్ కార్
హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఫతే మైదానం వద్ద ఉన్న బెంజ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే బెంజ్ కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగ,మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అయితే కారులో వ్యాపించిన మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫైర్ సిబ్బంది వచ్చే లోపే బెంజ్ కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘటనలో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది.

