ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇచ్చింది TGSRTC. ఇక నుంచి ఆర్టీసీ కండక్టర్ లకు చిల్లర కష్టాలు దూరమయ్యాయి. వారితో పాటు ప్రయాణికులకు కూడా వెసులుబాటు కలిగింది. అసలు విషమేమిటంటే.. ప్రయాణికులు ఇకపై ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులను TGSRTC అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్ లైన్ టికెటింగ్ మొదలైంది. ఇక సిటి బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో డబ్బులు చెల్లించవచ్చు. ఆటోమేటిక్ ఫెర్ కలెక్షన్ సిస్టం లో భాగంగా ఆన్ లైన్ టికెటింగ్ ఆర్టీసీ తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయంటోంది ఆర్టీసీ.

