Home Page SliderTelangana

సైబర్ వలలో చిక్కిన తహశీల్దార్

సైబర్ మోసగాళ్ల ముందు ఎవరైనా సరే వారి వలలో చిక్కుకోవాల్సిందే. సైబర్ మోసగాళ్లు ఏకంగా ఓ ఉన్నతాధికారికే కుచ్చుటోపీ పెట్టారు. యాదాద్రి జిల్లా రాజాపేట తహశీల్దార్ ఎం.దామోదర్ కు ఏసీబీ అధికారిగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి అవినీతికి పాల్పడుతున్నావంటూ డబ్బులు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు జరుగుతుండడంతో ఆందోళన చెందిన సదరు అధికారి వారి మాటలకు భయాందోళనకు గురయ్యాడు. డబ్బులు ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని చెప్పడంతో ఆన్ లైన్ లో 3.30 లక్షలు పంపించాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ కు తహశీల్దార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.