Home Page SliderNational

కారులో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌..!

కారులో వెళ్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేసింది ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. బెంగళూరులోని ఆర్టీ నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో డ్రైవింగ్‌ కూడా చేయడంతో ఓవర్‌ స్పీడింగ్‌, డ్రైవింగ్‌లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి.. వెయ్యి రూపాయల ఫైన్‌ విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ సిబ్బంది ఆమెకు జరిమానా నోటీసును అందజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బెంగళూరు నార్త్ ట్రాఫిక్‌ డీసీపీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు ఈ వార్తపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు ఇది. అంతకు మించిన ల్యాప్ టాప్ డ్రైవింగ్. మనుషులు మరి ఇంత బిజీనా!? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా!? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కారు నడుపుతూ పని చేయడం కాదు కదా. మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాదు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి కొలువులు చేసేవాళ్లే యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై నలుగురికి అవగాహన కల్పించాల్సిన వాళ్లే తమకేం పట్టనట్టుగా ఇలా వ్యవహారిస్తుండటం బాధాకరం. అంటూ పోస్టులో రాసుకొచ్చారు.