పైరవీలు ఉండవ్.. అర్హులకే పథకాలు
నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావు లేవన్నారు. గతంలో జరిగిన గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చి ప్రస్తుతం ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాకపోతే ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు నాలుగు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

