కృష్ణవేణిలో ముందస్తు సంక్రాంతి సంబురాలు
హైద్రాబాద్ జియాగూడ పరిధిలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్ధుల చేత అనేక సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు.గోపికలు,గొబ్బెమ్మలు,చెరకులు, హరిదాసుల వేషధారణల్లో విద్యార్ధులు అలరించారు. పిండివంటలు,గంగిరెద్దులు,సన్నాయి మేళాలు, రంగవల్లులు…ఇలా అనేక సంసృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ వాతావరణాన్ని చాటిచెప్పేలా ముందస్తు వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్ధులకు పలు పోటీలు నిర్వహించారు. విజేతలైన విద్యార్ధులకు బహుమతులు పంపిణీ చేశారు.అదేవిధంగా పోటీల్లో పలువురు మహిళలు,ఉపాధ్యాయినిలు కూడా పాల్గొని విద్యార్ధుల్లో ఉత్సుకతను రేకెత్తించారు.అంతా సరదాగా ఆడిపాడి పండుగ శోభను తీసుకొచ్చారు.అనంతరం జరిగిన సభలో స్కూల్ మేనేజ్ మెంట్ సభ్యులు మాట్లాడారు. సంక్రాంతి అంటే సంసృతి అని అలాంటి సంస్కృతిని ప్రతీ కుటుంబం తనలో భాగస్వామిగా మార్చుకోవాలని అప్పుడే పండుగలకు విశిష్టత,ప్రాధాన్యాలుంటాయన్నారు.ఈ సంక్రాంతి అందిరి జీవితాల్లో ఉన్నతమైన,ఉత్తమమైన వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు.

