నిరుద్యోగుల కోసం బంపర్ ఆఫర్…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రత్తిపాడు మండలంలోని యువతకు మరో బంపర్ అవకాశం వచ్చి చేరింది. నిరుద్యోగ యువతకు డ్రోన్ టెక్నాలజీ లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా, ప్రత్తిపాడు మండల వ్యవసాయాధికారి కె. అరుణ కుమారి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 80 శాతం రాయితీతో డ్రోన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. ఇంటర్ చదివిన నిరుద్యోగ యువత మాత్రమే ఈ శిక్షణకు అర్హులై ఉంటారు. 15 జనవరి 2025 వరకు ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించబడతాయి, ప్రత్తిపాడు మండలానికి కేవలం రెండు డ్రోన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 80 శాతం రాయితీతో ప్రభుత్వమే డ్రోన్‌ను అందిస్తుందని, అభ్యర్థులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు అందజేయబడుతున్న ప్రీమియం చెల్లించడానికి 15 జనవరి 2025 వరకు తుది గడువు నిర్ణయించబడింది.

