బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ ..ఇక మిగిలింది దంగల్..
బాహుబలి 2 చిత్ర రికార్డులను తాజాగా పుష్ప 2 చిత్రం బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని పుష్ప 2 టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు సినిమాలలో ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 1810 కోట్లు సాధించిన బాహుబలి 2 చిత్ర వసూళ్లు అధిగమించి, రూ.1831 కోట్లు వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ తెలిపారు. బాలీవుడ్ చిత్రం దంగల్ రూ. 2 వేల కోట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఉన్న బాహుబలి స్థానంలో పుష్ప 2 వచ్చి చేరింది. ఈ ఘనత కేవలం 32 రోజులలో సాధించినట్లు తెలిపారు. మరికొన్ని రోజులలో మొదటి స్థానంలో ఉన్న దంగల్ చిత్రం రికార్డు కూడా బ్రేక్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

