మన్మోహన్ అంత్యక్రియలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
మాజీ ప్రధాని మన్మోహన్‌ను కేంద్రప్రభుత్వం అవమానించిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ భరత మాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధానికి సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించలేదన్నారు. మాజీ ప్రధానుల అంత్యక్రియలన్నీ అధికారిక స్మశానవాటికలో నిర్వహించి, మన్మోహన్ అంత్యక్రియలు మాత్రం నిగమ్ బోధ్ ఘాట్‌లో ఎందుకు జరిపారన్నారు. ఆయనకు మెమోరియల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

