కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించిన కేసు విచారణ జనవరి 6కు వాయిదా పడింది. అయితే.. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి హార్ట్ సర్జరీ కారణంగా హాజరు కాలేకపోతున్నానని ఆయన పోలీసులకు తెలిపారు. అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు జనవరి 6కు వాయిదా వేశారు. కేసులో కౌశిక్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, మరో 20 మంది అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు.

