ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్..
ఇండియా కూటమి పార్టీలకు చెందిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఢిల్లీ ఎన్నికల వేళ విభేదాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇండియా కూటమి నుండి కాంగ్రెస్ పార్టీని తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల సందర్భంగా పలు హామీలు గుప్పిస్తోంది ఆప్ పార్టీ. ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలను, కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనితో ఆప్ మండిపడుతోంది. పలు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో ఇండియా కూటమిలో ఇప్పటికే కోల్డ్ వార్ జరుగుతోంది. మరోపక్క ఇండియా కూటమికి మమతా బెనర్జీని చీఫ్‌గా చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

