Home Page SliderInternational

‘అక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది’..బ్రిటన్

బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బంగ్లాదేశ్‌లో రద్దీ ప్రాంతాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కడ మైనారిటీ వర్గాలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ధ ఇస్కాన్ ప్రచార కర్త కృష్ణదాస్‌ను అరెస్టు చేయడంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడి పరిణామాలను తమ కార్యాలయాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు.