Andhra PradeshBusinessHome Page SliderNews Alert

ఏపీలో ఘోరంగా జీఎస్టీ వసూళ్లు

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీలో వాణిజ్యం తిరోగమనం బాట పట్టిందని కేంద్ర మంత్రిత్వ శాఖ లెక్కల్లో తెలుస్తోంది. గడచిన మూడు నెలల్లో 4నుండి 7 శాతం చొప్పన జీఎస్టీ వసూళ్లు తగ్గగా,  నవంబర్‌లో ఏకంగా 10 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాదితో (రూ.4,093 కోట్లు) పోలిస్తే 10 శాతం తగ్గి  రూ.3,699 కోట్లు వచ్చిందని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సౌత్ ఇండియా లో అన్ని రాష్ట్య్రాల్లో GST  పెరిగింది కానీ ఒక ఏపీలోనే తగ్గిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడు 8 శాతం, కర్ణాటక 15 శాతం, కేరళ 10 శాతం, తెలంగాణ 3 శాతం వృద్ధి నమోదు చేయగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే క్షీణతను నమోదు చేసింది. ఆర్థిక అభివృద్ధికి సూచికగా చెప్పుకునే జీఎస్టీ వసూళ్లు తగ్గడంతో ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.