మళ్లీ పులి దాడి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. నిన్న పులిదాడిలో లక్ష్మి అనే యువతి మృతి చెందగా ఇవాళ ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. సిర్పూర్ మండలం దుబ్బగూడ శివారులో ఇవాళ ఉదయం సురేశ్ అనే రైతుపై పులి దాడి చేసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. వరుస పులి దాడి ఘటనలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో గజగజ వణుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

