రష్మిక డేరింగ్ కిస్ సీన్…’యానిమల్’ పోస్టర్ వైరల్
‘యానిమల్’ మూవీ డైరక్టర్ సందీప్ వంగా హీరోహీరోయిన్లు రష్మిక, రణబీర్ కపూర్ల కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక, రణబీర్‌ల లిప్ లాక్ కిస్ సీన్ వైరల్ అవుతోంది. ‘అమ్మాయి’ అనే పాటను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మళయాల భాషలలో ఈ చిత్రం రాబోతోంది. ఈ పోస్టర్‌లో వీరిద్దరూ విమానంలో పైలట్ సీట్లలో కూర్చుని, తలపై హెడ్ సెట్స్ పెట్టుకుని ముద్దాడుతున్న సీన్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు. డిసెంబర్‌లో చిత్రం విడుదల కాబోతోంది.
