నయనతార రూట్ ను ఫాలో అవుతున్న అక్కినేని ఫ్యామిలీ……!
తాజాగా నాగ చైతన్య మరియు శోభితల పెళ్లి వార్తలు బాగా వినిపిస్తున్నాయి . డిసెంబర్ 4 న నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలోని తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద తమ పెళ్లి జరగనుందని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో నయనతార తన పెళ్ళి వీడియో ను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించింది. అదే తరహాలో నాగ చైతన్య మరియు శోభిత కూడా తమ పెళ్ళి వీడియో డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని కొత్త జంట భావించినట్లు తెలుస్తోంది. దీని స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్తోపాటు ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. దానితో అక్కినేని ఫాన్స్ ఆనందంతో ఆ కొత్త జంటకి విషెస్ చెప్పారు.

