మ్యాజిక్ చేసిన మస్క్ – భారీగా సంపద పెంపు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద మ్యాజిక్ చేసినట్లు పెరిగిపోతోంది. దీనికి కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడమే. ఈ విజయంలో కీలక పాత్ర వహించిన మస్క్ భారీగా తన స్టాక్ మార్కెట్ వాటాను సాధించారు. తాజాగా 334.3 బిలియన్ల డాలర్ల నికర సంపదను పెంచుకున్నారు. ఎన్నికలయిన తర్వాత మస్క్‌కు సంబంధించిన టెస్లా కంపెనీ స్టాక్ 40 శాతం పెరిగిపోయింది. ట్రంప్ కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ బాధ్యతలను ట్రంప్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు అప్పగించారు.

