Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

యువ‌తిని బెదిరించి రూ.1.25కోట్లు స్వాహా

సైబ‌ర్ కేటుగాళ్ల నేర‌రూపాల‌కు హ‌ద్దు,అదుపు లేకుండా పోతున్నాయి.తాము సైబ‌ర్ పోలీసుల‌మ‌ని బెదిరించి ఏకంగా రూ.1.25 కోట్లు కాజేసిన వైనం వెలుగులోకి వ‌చ్చింది.విజ‌య‌వాడ‌లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఓ యువ‌తికి కొరియ‌ర్ వ‌చ్చింద‌ని న‌మ్మ‌బ‌లికి అందులో డ్ర‌గ్స్ ఉన్నాయ‌ని,వెంట‌నే మీరు పోలీస్ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని చెప్పారు.దాంతో యువ‌తి కంగారుప‌డిపోయింది. పరువుగ‌ల కుటుంబం కావ‌డంతో త‌న పేరు ప‌బ్లిక్‌లో కి వ‌స్తుంద‌నే భ‌యంతో సైబ‌ర్ మోస‌గాళ్లు అడిగినంత ఇచ్చేసింది.ఎమౌంట్ ఇస్తే కేసుల సంగ‌తి మేము చూసుకుంటామ‌ని చెప్ప‌డంతో నేర‌గాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ. 1.25కోట్ల‌ను ఇమ్మీడియెట్ గా ట్రాన్స్ఫ‌ర్ చేసింది.తీరిగ్గా ఆలోచించాక‌… విజ‌య‌వాడ సైబ‌ర్ పోలీసుల‌కు బాధితురాలు కంప్లెయింట్ చేసింది.దీంతో సైబ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.