crimeHome Page SliderNationalNewsNews Alert

చ‌త్తీస్ గ‌ఢ్‌లో మావోల స్థూపాలు నేల‌మ‌ట్టం

చ‌త్తీస్ గ‌ఢ్ కొండ‌ప‌ల్లి దండ‌కార‌ణ్యంలో ప‌లు చోట్ల మావోల స్థూపాల‌ను స్పెష‌ల్ టీం పోలీసులు గుర్తించి గురువారం నేల‌మ‌ట్టం చేశారు. గ‌త రెండు రోజుల నుంచి సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న స్పెష‌ల్ బెటాలియ‌న్ కి మొత్తం రెండు మావోయిస్టుల స్థూపాలు క‌నిపించాయి. వీటిని పూర్తి గా నేల‌మ‌ట్టం చేశారు.గ‌త మూడు రోజుల కింద‌ట ఇదే ప్రాంతానికి చెందిన గిరిజ‌నుడుని మావోయిస్టులు ఇన్ఫార్మ‌ర్ నెపంతో ప్ర‌జాకోర్టు పేరుతో పిలిచి హ‌త్య చేసిన నేప‌థ్యంలో పోలీసులు ఈ సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించారు.