కలెక్టర్ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్ ఎందుకంటే..
ఒక కలెక్టర్‌తో సహా ఇద్దరు ఐఏఎస్ అధికారులపై సస్పెన్షన్ విధించారు. ఐఏఎస్ గోపాలకృష్ణ మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు సస్పెండ్ చేశారు. కలెక్టర్ బ్రో అని సోషల్ మీడియాలో పాపులర్ అయిన కలెక్టర్ ప్రశాంత్‌ను సోషల్ మీడియాలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు సస్పెండ్ చేసినట్లు సమాచారం. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. అయితే తాను వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించలేదని, తన ఫోన్ హ్యాక్ అయ్యిందంటూ ఐఏఎస్ గోపాలకృష్ణ వాదిస్తున్నారు. అయితే హ్యాక్ అయినట్లు ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు.

