Home Page SliderNational

అన్నకొడుకుకు ఎన్టీఆర్ ‘ఆల్‌ ది బెస్ట్’

బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్ బాటలో సినిమాలలో మరో నందమూరి వారసుడు హరికృష్ణ మనవడు కూడా  అడుగుపెట్టబోతున్నాడు. హరికృష్ణ కుమారుడు, ఎన్టీఆర్ అన్న జానకి రామ్ కుమారుడు తారకరామారావు కూడా హీరోగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని వైవీఎస్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. ఈ సంగతి తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘రామ్ నీ మొదటి అడుగుకు స్వాగతం. మీ ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల ఆశీర్వాదంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని ఆశిస్తున్నానని’ అంటూ ట్వీట్ పెట్టారు.