32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ డైరెక్టర్ గా టి.మోహన్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనబాక రచనను నియమించారు. శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా టి.బాపిరెడ్డి, ఏపీ శిల్పారామం సొసైటీ సీఈఓగా వి.స్వామినా యుడు, సీసీఎల్ఎ సహాయ కార్యదర్శిగా డి.లక్ష్మా రెడ్డిని, మిగిలిన వారిని వివిధ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

