Home Page SliderInternationalNews

మైక్రోసాఫ్ట్‌కు రాజీనామాల సెగ

సాఫ్ట్‌వేర్ రంగంలో కింగ్ మేకర్‌గా పేరుపొందిన దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు రాజీనామాల సెగ తగులుతోంది. ఈ కంపెనీకి చెందిన డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ రిపోర్టు ప్రకారం స్వచ్ఛంద రాజీనామాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మొత్తం రాజీనామాలలో 32.7 శాతం మహిళలే ఉన్నట్లు తెలిసింది. వీరిలో నల్లజాతీయులు, లాటినిక్స్ వంటి వర్గాల స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. దీనికి ప్రత్యర్థి సంస్థలు తమ ఉద్యోగులను లాక్కోవడం, ఆన్‌లైన్ వ్యాపారం వంటివి కారణాలుగా సంస్థ పేర్కొంటోంది. ఉద్యోగులలో వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రణాళికలు రచిస్తోంది మైక్రోసాఫ్ట్. ఈ వైవిధ్యం ఏఐ ప్రాజెక్టులకు చాలా ముఖ్యంగా భావిస్తోంది. జాతి, లింగ వివక్ష లేకుండా ఉండాలని భావిస్తోంది. గతంలో బ్లాక్‌రాక్ సంస్థ కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంది.