BusinessNews Alerttelangana,

మరోసారి భగ్గుమన్న బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గితే రెండింతలు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా మరోసారి భగ్గుమని మండే ధరలతో బంగారం పైకి ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.870 పెరిగి, రూ.78,980కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.800 పెరిగి రూ.72,400 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారానికి తీసిపోకుండా పైకి ఎగబాకుతోంది. కేజీ వెండి రూ. 2000 పెరిగి రూ.1,05,000లకు చేరింది.