మొన్న అదానీ, నేడు అంబానీ పోటీపడి సీఎం సహాయనిధికి విరాళాలు..
తెలంగాణ వరద బాధితుల సహాయార్థం అపర కుబేరులు అదానీ, అంబానీలు పోటీపడి విరాళాలు ఇస్తున్నారు. అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. రూ. 20 కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి ఇచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి చెక్కును సమర్పించారు. ఈ మధ్యనే అదానీ గ్రూప్ తరపున గౌతమ్ అదానీ స్వయంగా రేవంత్ రెడ్డిని కలిసి రూ. 25 కోట్లు విరాళం చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.

