Home Page SliderNational

ట్రాఫిక్ దెబ్బకు ఓ రైలునే ఆపేశారు..

భారతీయ రైల్వేకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ కారణంగా ఏకంగా ఓ రైలును నిమిషాల పాటు ఆపేశారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరును ట్రాఫిక్ నగరంగా పిలుస్తుంటారు. తాజాగా.. అక్కడ ట్రాఫిక్ రద్దీకి తార్కాణం పట్టే ఘటన ఐటీ సిటీలో బుధవారం చోటు చేసుకుంది. బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి కిలోమీటర్ల కొద్దీ వాహనాలు రోడ్లపై నిలిచిపోవడం పరిపాటి..అయితే ఇక్కడ ఏకంగా ఒక రైలును నిమిషాల పాటు బెంగళూరు ట్రాఫిక్ నిలిపివేయడం విశేషం. సోషల్ మీడియాలో సంబంధిత వీడియోను సుధీర్ చక్రవర్తి అనే వ్యక్తి ఇన్ట్స్ గ్రామ్ లో పోస్ట్ చేశారు. రైల్వే క్రాసింగ్ లైన్ పై వాహనాలు బారులు తీరడంతో ఆ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుని రైలు పట్టాలపై నిలిచిపోయింది. బెంగళూరు మున్నేకొళ్లాల రైల్వే క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగింది.