కల్తీ నెయ్యిలో జగనే కారణం
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి మాజీ సీఎం జగనే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కల్తీ నెయ్యిలో వచ్చిన కమీషన్ జగన్ మోహన్ రెడ్డికి వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి రూ. కోట్లలో నష్టం వాటిల్లిందన్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తక్కువ ధరకే నెయ్యి టెండర్ వచ్చి కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను జగన్ మంట గలిపారన్నారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.

