Andhra PradeshHome Page Slider

“ఏపీలో మెడికల్ కాలేజీలపై స్కామ్ జరుగుతోంది”..మాజీ మంత్రి

ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే స్కామ్ జరుగుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫంక్షనింగ్ జీఓ రద్దు చేస్తామని, ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ ఆలోచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జరిగితే పేదలకు వైద్యం భారం కావడం ఖాయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. పేదలు ఎంతో సంతోషంగా ఆసుపత్రులకు వెళ్లేవారని, వారికి అన్ని వైద్య సదుపాయాలు ఉండేవన్నారు. ఏపీలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, ఐదేళ్లలో ఐదు పూర్తి చేశామన్నారు. మరో ఐదు నిర్మాణదశలో ఉన్నాయన్నారు.  2019 వరకూ ఆంధ్రలో 11 కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కేవలం ఐదేళ్లలోనే ఐదు కాలేజీలు కట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. మిగతా కళాశాలలను పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.