Home Page SliderTelangana

ఆ ఊరిలో అబద్ధాలు చెప్పరట!

మన తెలంగాణను కుతుబ్ షాహీలు, కాకతీయులు, నిజాం ప్రభువులు పరిపాలించారు. వారి పాలనలో ఎవరైతే సమాంతరాజులు ఉంటారో వారి పేర్ల మీదుగా కొన్ని జిల్లాల పేర్లు, గ్రామాల పేర్లు కూడా వెలిశాయి. ఇందులోనే భాగంగా కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలంలోని నిజాయితీ గూడెం అనే గ్రామం ఉంది. పేరులో ఉన్నట్టే ఈ ఊర్లో అందరూ నిజాయితీగానే ఉంటారట. అలాగే ఎవరూ అబద్ధాలు కూడా చెప్పరని మరికొందరు అంటున్నారు. ఈ గ్రామాన్ని అప్పుడు నిజాం ప్రభు పరిపాలించే వాళ్లు.. ఊరు గ్రామస్తులు అందరూ అప్పుడు నిజాయితీగా ఉండేవాళ్లట. అందుకే ఈ గ్రామం పేరు నిజాయితీ గూడెం అని పేరు పెట్టారని గ్రామస్తులు చెబుతున్నారు.

అలాగే ఓ బ్రాహ్మణుడు చెప్పిన కథ ప్రకారం.. ఓ మహిళ తన పుస్తెల తాడును ఓ మేకుకు తగిలించి.. స్నానం చేయడానికి వెళ్లిందట. ఆమె తిరిగి వచ్చేలోపే ఆ పుస్తెల తాడుకి చెదలు పట్టాయట. అప్పటి నుంచి ఆ ఊర్లో ఎలాంటి అంటువ్యాధులు రావట్లేదని, వడగళ్ల వాన కురవట్లేదని, ప్రకృతి కూడా ఎప్పుడూ తమకు అనుకూలంగా ఉంటుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని అంటున్నారు. అలాగే ఊరుకు చుట్టుపక్కల పచ్చని పొలాలు, నాణ్యమైన రోడ్లు, త్రాగు నీరు, సాగు నీరు పుష్కలంగా ఉండడంతో భూమికి పచ్చని రంగు వేసినట్టు ఊరంతా పచ్చగా కళకళలాడుతుంది. ఊర్లో కూడా చాలా మంది ఎక్కువ చదువుకున్న వాళ్లే ఉండడం విశేషం. అలాగే కొంత మంది వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.