తిరుమలలో బంగారు బల్లి ప్రత్యక్షం
తిరుపతిలోని శేషాచలం అడవులలో చాలాకాలం అనంతరం బంగారు బల్లి ప్రత్యక్షమయ్యింది. ఈ జాతి బల్లులు అంతరించే దశకు చేరుకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘గోల్డెన్ గైకో’గా పిలుచుకునే ఈ జాతి బల్లిని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు గుర్తించి ఫొటోలు తీశారు. ఇవి రాతి బండలలో, చీకటి ప్రదేశాలలో మాత్రమే అరుదుగా కనిపిస్తాయి. ఇవి ఒకేసారి 40 నుండి 150 గుడ్లను పెట్టగలవు. ఇవి ఎక్కువగా తిరుమల కొండలలోనే కనిపిస్తాయి. గత ఏడాది పాపి కొండల అభయారణ్యం, కళ్యాణి డ్యాం పరిసర ప్రాంతాలలో వీటిని చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఇవి కనిపించడం అదృష్టంగా భావిస్తారు.

