Home Page SliderNational

వైద్యులు జవాన్లను చూసి నేర్చుకోండి..

కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు వైద్యులు.  వారిని తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్యులు జవాన్లను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు. విధులను బహిష్కరించి ఆందోళనలు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. వారు సమాజానికి ఎంతో ముఖ్యమైన వారని పేర్కొన్నారు. సమ్మెను ఆపాలని అభ్యర్థించారు. వారి వృత్తిని జవాన్లతో పోలిక పెట్టారు. పుల్వామా ఘటనలో అసలు న్యాయమే జరగలేదు. అందుకని జవాన్లు సరిహద్దులు వదిలి వచ్చేశారా?. న్యాయం కావాలని నిరసనలకు దిగారా ?అంటూ ప్రశ్నించారు. అలాగే వైద్యులు కూడా తమ పనులు మానుకోవద్దని అభ్యర్థించారు. ఈ ఘటనపై తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.