కేసులపై బొత్స సంచలన వ్యాఖ్యలు
ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుండి శాసన మండలి ఎమ్మెల్సీగా ఎన్నికయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించవలసిందే. కానీ నేరం చేయని వాళ్లపై కేసులు మోపడం చాలా తప్పని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఎంక్వైరీలకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చామా, లేదా అన్నది పక్కన పెడితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అన్నారు. ఎవరి మీదో బురద జల్లి ఆనందం పొందాలనేది మా వైఖరి కాదన్నారు. హామీలు నెరవేర్చే వరకూ ప్రజల పక్షాన పోరాడతాం అన్నారు. శాసన మండలి తరపున ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షంగా పోటీ ఇస్తాం అన్నారు.

