లోక్‌సభలో ఈటెల రాజేందర్ సూటి ప్రశ్న
లోక్‌సభలో ఈటెల రాజేందర్ తెలంగాణలో రోడ్ల అభివృద్ధి గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో కి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో అనేక జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ” రాష్ట్రంలో 1947 నుండి 20014 వరకూ ఎన్ని జాతీయ రహదారులు నిర్మించబడ్డాయో, 2014 నుండి 2024 వరకూ ఈ పదేళ్ల కాలంలో అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు నిర్మించబడ్డాయి. హైదరాబాద్ నుండి విజయవాడ, హైదరాబాద్ నుండి ఛత్తీస్ ఘడ్, హైదరాబాద్ నుండి నాగపూర్ వరకూ ఈ పదేళ్ల కాలంలోనే జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. జీడిమెట్ల ప్రాంతంలో యాక్సిడెంట్ల కారణంగా ఇప్పటి వరకూ 60 మంది విద్యార్థులు మరణించారు. హైదరాబాద్‌లో ఇంకా ఎన్నో అండర్ పాస్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ నేషనల్ హైవే వద్ద రెండు ఓవర్ బ్రిడ్జ్, ఛత్తీస్ ఘడ్ వైపు రెండు, కొంపల్లి నుండి నాగపూర్ వైపు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయవలసింది. వీటిని అనుసంధానం చేస్తూ మెట్రోరైలును కూడా నిర్మించవలసింది. మేడ్చల్ మెట్రోరైలును కూడా లింక్ చేస్తూ నిర్మాణం చేయవలసిందిగా రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కోరుతున్నాను”.
దీనిపై మంత్రి బదులిస్తూ ఇప్పటికే కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌కు చాలా ప్రాజెక్టులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ స్థలాలు సేకరించి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
