“పుష్ప 2” తర్వాత ఐకాన్ స్టార్ అర్జున్-అట్లీ డైరెక్షన్లో సినిమా..
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా షూటింగ్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలైంది. ఇక ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయనున్న సినిమాలు ఎవరితో అనేవి ఆల్రెడీ ఫిక్స్..
మరి వీటిలో దర్శకుడు త్రివిక్రమ్‌తో ఆల్రెడీ ఓ సినిమా ఫిక్స్ కాగా తన లైనప్‌లో మరో దర్శకుడు అట్లీతో కూడా సినిమా చేయబోతున్నారని ఆ మధ్య టాక్.. అయితే దీనిపై బన్నీ కాంపౌండ్ నుంచి అసలు క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా కానీ లేదా త్రివిక్రమ్‌తో సినిమా కానీ మొదలు పెట్టనున్నాడని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అల్లు అర్జున్ లైనప్‌లో అట్లీ సినిమా డెఫినిట్‌గా ఉందని కన్ఫర్మ్.. మరి ఆ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరిని Choose చేస్తారో వేచి చూడాలి.

