రైతుల ఖాతాలలో రూ.6190 కోట్లు జమ-రేవంత్ రెడ్డి
అప్పులతో బాధపడిన తెలంగాణ రైతాంగానికి మంచిరోజులు వచ్చాయని, రైతు రుణమాఫీ కింద సుమారు 6.4 లక్షల మంది లబ్ది పొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రెండవ విడతలో రూ.6,190 కోట్లు జమ చేసింది అని పేర్కొన్నారు. తొలి దశలో 11.34 లక్షల మందికి రూ.6,035 కోట్లు జమ చేశారన్నారు. రెండు దశలలో రైతుల ఖాతాలలో రూ.12,225 కోట్లు జమ చేయగా, 17.75 లక్షల మంది లబ్ది పొందారన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటామని, ఆగస్టులో రూ.2 లక్షలలోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. పంటలభీమా కూడా కల్పించి, రైతులకు అండగా ఉంటామన్నారు. రైతే రాజు అనే నినాదానికి కాంగ్రెస్ పార్టీ అసలైన అర్ధం చెప్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ హామీలిచ్చినప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన వారి నోళ్లు మూతపడేలా రుణమాఫీ చేసి చూపిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

