Home Page SliderTelangana

తెలంగాణా పంచాయితీ ఎన్నికలపై సీఎం సమీక్ష

తెలంగాణాలో జరగబోయే పంచాయితీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే కులగణన జరిగితేనే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాలను సీఎం పరిశీలించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో గ్రామ పంచాయితీల టర్మ్ ముగిసి దాదాపు 6 నెలలు  అవుతుంది. దీంతో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.