“కిషన్‌రెడ్డి పదవి కోసం తెలంగాణా హక్కులను తాకట్టు పెట్టారు”:సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ,బీహార్‌కు వరాల జల్లు కురిపించిన కేంద్రం మిగతా రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపించింది. కాగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణా రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుర్చీని కాపాడుకోవడం కోసం మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందన్నారు.కేంద్ర బడ్జెట్‌లో ఏపీ,బీహార్‌కు మాత్రమే నిధులు కేటాయించడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రజలు బీజేపీపై వివక్ష చూపకపోయినప్పటికీ కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిదన్నారు.కాగా బీజేపీకీ తెలంగాణాలో ఓట్లు,సీట్లు మాత్రమే కావాలన్నారు.తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని పట్టించుకోరా అని సీఎం ప్రశ్నించారు. కాగా తెలంగాణా ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. అలాగే మోదీ మంత్రి వర్గం నుంచి ఆయన తప్పుకోవాలన్నారు.కుర్చీ కోసం కిషన్ రెడ్డి మౌనంగా ఉండొద్దని సీఎం సూచించారు. తెలంగాణాకు ఐఐఎంలు ఎందుకు ఇవ్వడం లేదని సీఎం ప్రశ్నించారు. కాగా ఐఐఎంలు తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వబోమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.పునర్విభజన చట్టం తెలంగాణాకు కూడా వర్తిస్తుందన్నారు.ఈ మేరకు సవరించిన బడ్జెట్‌లో అయినా తెలంగాణాకు న్యాయం చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు.రాష్ట్రంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,పాలమూరు ప్రాజెక్ట్,నిధులు ఇవ్వండి అని సీఎం తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కూడా నిధులు కేటాయించాలని సీఎం పేర్కొన్నారు.అయితే కేంద్రమంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణా హక్కులను తాకట్టు పెట్టారని సీఎం విమర్శించారు. కాగా తెలంగాణా హక్కులను కాపాడటానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

