బ్యారేజీల రక్షణ చర్యలపై నేడు ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మూడు బ్యారేజీల రక్షణ చర్యలు, లోపాలపై జరుగుతున్న పరిశోధన పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించనునన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ (ఎన్ఎస్‌డీఏ) గతంలో ప్రభుత్వానికి అందించిన మధ్యంతర నివేదిక ఆధారంగా ఆయా అంశాలపై సమీక్షించనున్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించనున్న ఈ సమీక్షకు సంబంధిత ఇంజినీర్లు, తదితర సంస్థల ప్రతినిధులు హాజరుకావాలని నీటిపారుదల శాఖ సూచించింది.

