Home Page SliderNational

“యాక్టర్ నుంచి డాక్టర్‌గా మారిన సాయిపల్లవి”

“డాక్టర్ అవబోయి పొరపాటున యాక్టర్ అయ్యాను” అని చాలా సందర్భాల్లో సెలబ్రీటీలు చెబుతుంటారు. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. యాక్టర్లుగా మారిన తర్వాత కూడా కొంతమంది తమ కలను నెరవేర్చుకునేందుకు ఆసక్తి కనబరచి డాక్టర్లుగా మారుతున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయి పల్లవి. అయితే సాయిపల్లవి సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తూనే మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. కాగా సాయిపల్లవి తన డాక్టర్ చదువును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయిపల్లవి ఇటీవల జరిగిన కాలేజ్ ఫంక్షన్‌లో డాక్టర్ పట్టా అందుకున్నారు.సాయిపల్లవి లాగే టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా కూడా ప్రస్తుతం మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా శ్రీలీలా కూడా త్వరలోనే డాక్టర్ పట్టా అందుకోనున్నారు.