Andhra PradeshHome Page Slider

మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఆ శాఖే…!

మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీరు, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను ఇచ్చారు. నారాయణకు మన్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలు ఇచ్చారు. హోం మంత్రిగా వంగలపూడి అనితకు అవకాశమివ్వగా, అచ్చెన్నాయుడికి వ్యవసాయశాఖ, కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖలు, నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ, సత్యకుమార్ యాదవ్ కు హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలు కేటాయించగా, నిమ్మల రామానాయుడికి నీటిపారుదల శాఖ, ఎన్ఎండీ ఫరూక్ కు న్యాయశాఖ, మైనార్టీ శాఖలు, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయశాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సులు, శాసనసభా వ్యవహారాల శాఖ, అనగాని సత్య ప్రసాద్ కు రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖలు ఇచ్చారు. పార్థసారధికి హౌసింగ్, ఐ అండ్ పీఆర్ ఇవ్వగా, డోలా వీరాంజనేయ స్వామికి సామాజిక శాఖ, వాలంటీర్, సచివాలయ శాఖల బాధ్యతలు ఇచ్చారు. గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు టూరిజం, సినిమాటోగ్రఫీశాఖలు, గుమ్మడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయల శాఖలు, టీజీ భరత్ కు ఇండస్ట్రీస్-కామర్స్, సవితకు బీసీ వెల్ఫేర్, చేనేత. వాసంశెట్టి సుభాష్ కు లేబర్, కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, ఎన్నారై శాఖలు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి ట్రాన్స్‌పోర్ట్, యువజన సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు.