రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కందుల దుర్గేష్
రాష్ట్ర మంత్రిగా జనసేన నేత కందుల దుర్గేష్ ప్రమాణస్వీకారం చేశారు. కందుల దుర్గేష్ అని పిలవబడే కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ జనసేన నాయకుడు. 2007-2013 వరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసాడు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికల పోలింగ్‌లో ఓడిపోయాడు. ఆ ఎన్నికలో 42,685 ఓట్లు సాధించాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


